Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఔదార్యం చాటుకున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు 

ఔదార్యం చాటుకున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులు 

- Advertisement -

సీఆర్పీ సంతోష్ కుటుంబానికి రూ. 50 వేలు అందజేత
నవతెలంగాణ – పెద్దవంగర
: మహబూబాబాద్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నారు. మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన వేముల సంతోష్ సీఆర్పీ గా ఎమ్మార్సీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల అతని భార్య ఝాన్సీ, తండ్రి లక్ష్మణ్ ఇరువురు ఒకే రోజు మృతి చెందారు. ఆయన కు కుమారుడు అఖీల్ తేజ్, కుమార్తె అభిదామిని ఉన్నారు.

స్నేహితుడి కుటుంబాన్ని ఎస్ఎస్ఏ ఉద్యోగులు అండగా నిలిచారు. సంతోష్ కుటుంబాన్ని వారు పరామర్శించి, రూ. 50 వేలు పాప పేరు మీద ఫిక్సడ్ డిపాజిట్ చేశారు. డిపాజిట్ పత్రాలను తొర్రూరు ఎంఈవో మహంకాళి బుచ్చయ్య చేతుల మీదుగా శనివారం అందజేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేష్, జానకి రాములు, జిల్లా అధ్యక్షుడు మహంకాళి వీరన్న, ఉపాధ్యక్షుడు బాబులాల్, సీఆర్పీలు రంగన్న, రమేష్, నిరంజన్, అనిల్, శ్రీనివాస్, బాలాజీ, వీరాస్వామి, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -