Sunday, July 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ-బొమ్మలరామారం : గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలాని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యాకల శ్రీశైలం అన్నారు. మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భూభారతిలో సమస్యలు  పరిష్కరించడం లేదని, పలు భూములపై అక్రమ డాక్యుమెంట్లను తొలగిస్తామని రెవెన్యూ అధికారులు అన్నారు. అయినా ఇప్పటివరకు తొలగించకుండా రైతులకు న్యాయం చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. సాగు, త్రాగు నీరు, విద్య, వైద్యం, భూ సమస్యలు, వేతనాలు, రహదారులు, డ్రైనేజీ లాంటి సామూహిక సమస్యలు పరిష్కరించాలని అన్నారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇంటి స్థలాలు, ఇండ్లు, మరుగుదొడ్లు మొదలగు వ్యక్తిగత సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఇలాంటి అనేక సమస్యల సాధనకై సీపీఐ(ఎం) గ్రామ ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు .ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు ముక్కల పున్నమ్మ, సత్యనారాయణ, వెంకటేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -