నవతెలంగాణ – మల్హర్ రావు : మండలంలోని నాచారం గ్రామానికి చెందిన బండారి దేవేందర్ అనే కౌలు రైతు ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు.. శనివారం మృతుని కుటుంబాన్ని శనివారం కాంగ్రెస్ నాయకులు పరమార్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించారు.
రూ.15 వేలు ఆర్థిక సాయం అందజేసి, చేయుతనిచ్చారు. గ్రామ మాజీ సర్పంచ్ ఓర్రె రాజైలు యాదవ్ రూ.5వేలు, మాజీ వార్డు సభ్యుడు తుటి దేవేందర్ రూ.5వేలు, పోలవేణి భాస్కర్ రూ.5వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఇస్నపు రవి, పిఏసిఎస్ డైరెక్టర్ సర్వినాయక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కన్నూరి రవి ,బూత్ కమిటీ అధ్యక్షులు కన్నూరి అశోక్, బండారి చిన్న ముత్తయ్య పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల చేయూత.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES