– కొండను తవ్వి ఎలుకను పట్టారు
– అవినీతి జరిగిందని ఎన్డీఎస్‌ఏ ఎక్కడా చెప్పలేదు
— మంత్రి ఉత్తమ్‌ది వృథా ప్రయాసే
– ఆయన ఆపసోపాలు చూస్తే జాలేస్తోంది : ఎన్డీఎస్‌ఏ రిపోర్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎన్డీఎస్‌ఏ రిపోర్టును అడ్డం పెట్టుకుని నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అదే పాత చింతకాయ పచ్చడిలా రాజకీయ ప్రసంగం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళ వారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్‌ఏ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. మంత్రి ఉత్తమ్ ది అంతా వృధా ప్రయాసేననీ, ఆయన ఆపసోపాలు చూస్తే జాలేస్తోందని అన్నారు. ఎన్డీఎస్‌ఏ ఏర్పాటును కాంగ్రెస్ పక్షానా లోక్‌సభలో వ్యతిరేకించిన ఉత్తమ్‌కు, నేడు దాని రిపోర్టు పవిత్ర గ్రంధంల్లా కనబడుతోందన్నారు. అప్పుడు తప్పైతే ఇప్పుడెలా సరైందని ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ నిర్మిస్తున్న పోలవరం లో డయాఫ్రం వాల్, గైడ్‌వాల్ కుప్పకూలాయని తెలిపారు. అయినా కూడా ఎన్డీఎస్‌ఏ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. అన్ని ప్రాజెక్టులకు ఒకే నిబంధన ఉండాలని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఎన్డీఎస్‌ఏ ను కూడా ఈడీ, సీబీఐ మాదిరిగా వాడుతున్నారనీ, ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై చేస్తున్న పని అని విమర్శించారు. ఎస్‌ఎల్బీసీ కన్న పెద్ద డిజాస్టర్ ఏం లేదనన్నారు. నాలు గేండ్లలో పూర్తి అవుతుందని 2008లో శంకుస్థాపన చేసి ఏడేండ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ కనీసం అంతర్ రాష్ట్ర ఒప్పందం కూడా చేయలేదని గుర్తుచేశారు. సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో రూ.1,426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి, రూ.160 కోట్ల ల్యాండ్ అక్వెజ నీషన్ కోసం ఖర్చు చేసి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఆ అవినీతిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారని తెలిపారు. అవినీతికి పాల్పడిందే కాకుండా తిరిగి మమ్మల్నే ప్రశ్నిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తాగు, సాగునీటి కోసం ప్రాజె క్టును పూర్తి చేసిందని తెలిపారు. ఆల్ జియలాజికల్ సర్వే ప్రకారం అ న్నారం, సుందిళ్ల లొకేషన్ మారిందని స్పష్టం చేశారు. అన్నిరకాల టెస్టులు జరిగాకే, డిజైన్లు ఆధారంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఇప్ప టికైనా మేడిగడ్డకు మరమ్మతులు చేసి, రైతులకు న్యాయం చేయాలన్నారు.
అంతా పాత చింతకాయ పచ్చడే
- Advertisement -
RELATED ARTICLES