Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాబోయే ఎన్నికలు సజావు జరిగేందుకు సహకరించాలి

రాబోయే ఎన్నికలు సజావు జరిగేందుకు సహకరించాలి

- Advertisement -

– రాయపోల్ ఎస్ఐ కుంచం మానస..
నవతెలంగాణ – రాయపోల్
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల సజావుగా జరిగేందుకు సహకరించి ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి వాటిని అడ్డం పెట్టుకొని గొడవలకు దిగవద్దని శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడానికి గ్రామస్తులు సహకరించాలని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస అన్నారు. ఆదివారం రాయపోల్ మండలంలో సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గ్రామాలను సందర్శించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీయడం జరుగుతుందన్నారు.

ప్రజల రక్షణ సెన్సాఫ్ సెక్యూరిటీ గురించి సీసీ కెమెరాలు చాలా ముఖ్యమని  24 గంటలు పనిచేస్తాయని సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజలు పెద్దలు వ్యాపారస్తులు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. గ్రామ ప్రధాన కూడలిలో మరియు  ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ముఖ్యమని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల పనిచేయడం లేదని తెలిపారు. గ్రామంలో ఉన్న యువకులు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు.యువకులు గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా  చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుందని తెలిపారు. యువకులు ఏదైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నారని తెలిస్తే  వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారిని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులము రుణమాఫీ అయిందని  కేవైసీ అప్డేట్ చేయాలని కారణాలతో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు, ఎవ్వరు కూడా బ్యాంకు వివరాలు మీ పర్సనల్ డాటాను షేర్ చేయవద్దని సూచించారు.ఆన్లైన్ మోసాల బారిన ఎవరు కూడా పడవద్దని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 సైబర్ సెల్ జాతీయ ప్లైన్ నెంబర్ కు ఫోన్ చేసి  ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.గ్రామంలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించిన, అనుమానాస్పదంగా ఎవరు కనిపించిన వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని  సూచించారు.ప్రజల సమస్యలు తీర్చడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవల అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -