Monday, July 14, 2025
E-PAPER
Homeజిల్లాలువెయ్యి కిలోల బెల్లం..50 కిలోల పటిక స్వాధీనం

వెయ్యి కిలోల బెల్లం..50 కిలోల పటిక స్వాధీనం

- Advertisement -

– బైకు, ముగ్గురిపై కేసు నమోదు 
– హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: అక్రమంగా తరలిస్తున్న  బెల్లం, పట్టిక తో పాటు బైకు స్వాధీనం చేసుకొని  ముగ్గురిని హుస్నాబాద్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిఐ పవన్ వివరాలను తెలిపారు. అక్కన్నపేట వద్ద శనివారం రాత్రి తనిఖీ చేస్తుతుండగా  బొత్తలపర్రె తండా కు చెందిన భూక్యా రమేష్ తన ద్విి చక్ర వాహనంపై 20 కిలోల బెల్లం,5 కిలోల పటిక, 2 లీటర్ల గుడుంబా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. రమేష్ ను  అదుపులోకి తీసుకొని విచారించగా అక్కన్నపేట కు చెందిన  బింగి చంద్రమౌళి, బింగి శారద ల వద్ద కొన్నానని తెలపగా వారి ఇంటి వద్ద తనిఖీలు నిర్వహించినట్లు  980 కిలోల బెల్లం ,45)కిలోల పటిక స్వాధీనం చేసుకున్నామని హుస్నాబాద్ ఎక్సైజ్ సి ఐ పవన్ తెలిపారు .ఈ తనిఖీల్లో ఎస్సైలు రూప, దామోదర్ , సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక ప్రతిభ చూపిన బద్దం రాజు, సతీశ్, ఎస్.రవీందర్ , విజయ్ లను సి ఐ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -