నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫీల్డ్ వెటర్నరీ వైద్యులు, రైతుల ప్రయోజనాల కోసం ద్విభాషా త్రైమాసిక పత్రిక అందుబాటులోకి వచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లోని విజయనగర్ కాలనీ వెట్స్ హౌమ్‌లో జరిగిన కార్యాక్రమంలో ఆ జర్నల్‌ను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎం.వి.రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాగజైన్ ప్రచురించాలని అసోసియేషన్ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. ఫీల్డ్ వెటర్నరీ వైద్యులకు జ్ఞానాన్ని రిఫ్రెష్ చేయడంతో పాటు పశుసంవర్థక పద్ధతులపై తాజా నవీకరణలను రైతులు తెలుసుకునేందుకు జర్నల్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రచురణకు అంతరాయం కలగకుండా సీజీ కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అనంతం కార్యక్రమానికి స్వాగతం పలికారు. మ్యాగజైన్‌ను తీసుకురావడంలో చేసిన ప్రయత్నాల గురించి వివరించారు. చీఫ్ ఎడిటర్ డాక్టర్ కొండల్ రెడ్డి ద్విభాషా త్రైమాసిక జర్నల్ లక్ష్యాలను తెలిపారు. ఎడిటోరియల్ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ సుధాకర్ రావులను పరిచయం చేశారు. మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ పశువుల పెంపకంపై తాజా సమాచారాన్ని అందించడం ద్వారా పశువుల రైతులకు సేవ చేస్తున్నందుకు అసోసియేషన్‌ను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ దుర్గయ్య, కెవిఎల్ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృత్తికి చేసిన అమూల్యమైన సేవలకుగాను ఐదుగురు సీనియర్ పశు వైద్యులకు పురస్కారాలు అందజేశారు.
ఫీల్డ్ వెటర్నరీ వైద్యులు, రైతుల కోసం ద్విభాషా త్రైమాసిక జర్నల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES