– రోడ్డు ప్రమాదంలో పెండ్లి కొడుకు, అతని స్నేహితుడు మృతి
– నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఘటన
నవతెలంగాణ-ఖానాపూర్
బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు పత్రికలు పంచడానికి వెళ్లిన పెండ్లి కొడుకుతోపాటు అతడి స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. మరో ఐదురోజుల్లో వివాహ వేడుకతో సందడిగా మారాల్సిన కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్ (21)కు కడెం మండలంలోని హరిజనవాడకు చెందిన యువతితో ఈ నెల 18న వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మురిమడుగు గ్రామానికి చెందిన తన స్నేహితుడు జస్వంత్‌తో కలిసి లక్ష్మణ్ పెండ్లి పత్రికలు పంచడానికి మోటార్ సైకిల్‌పై బయలుదేరాడు. ఈ క్రమంలో ఖానాపూర్ మండలంలోని కొమురంభీం చౌరస్తా సమీపంలో ద్విచక్ర వాహనం కల్వర్టును ఢకొీనడంతో ఇద్దరు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ అజరు, ఎస్‌ఐ రాహుల్ గైక్వాడ్‌తో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరో ఐదురోజుల్లో పెండ్లి భాజా మోగాల్సిన ఇంట్లో పెళ్లికొడుకు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్ల్లి..
- Advertisement -
- Advertisement -