Monday, July 14, 2025
E-PAPER
HomeNewsనేడు కొత్త‌ రేషన్‌కార్డుల పంపిణీ

నేడు కొత్త‌ రేషన్‌కార్డుల పంపిణీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: తెలంగాణ‌లో ఎన్నో ఏళ్ల నుంచి కొత్త‌ రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల నెరవేరబోతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరిలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నారు. తిరుమలగిరి తహసీల్దార్‌ కార్యాలయానికి సమీపంలో ఏర్పాటు చేసిన స‌భ‌ నుంచి సీఎం 11 మంది లబ్ధిదారులకు కార్డులు అందిస్తారు. అనంతరం బహిరంగసభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం కార్డులు పంపిణీ చేయగానే రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు ఆయా లబ్ధిదారుల చేతికందనున్నాయి. నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే సామేల్‌ కార్డుల పంపిణీ, సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -