Monday, July 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసిగాచి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి

సిగాచి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : సిగాచి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మైత్రివనంలోని తెలంగాణ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఎదుట సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. పరిశ్రమల్లో రెగ్యులర్గా తనిఖీలు చేయాలని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ తనిఖీలు సరిగా చేయకపోవడం వలన ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. యాజమాన్యాలతో లాలి చపడుతున్న ఇన్స్పెక్టర్ ల పైన చర్యలు తీసుకోవాలని పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, టి యు సి ఐ రాష్ట్ర అధ్యక్షులు సూర్యం, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎంకే బోస్, టి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -