Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలి 

చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం అలవాటు చేసుకోవాలి 

- Advertisement -

నార్కోటిక్స్ ఎస్పీ భూక్య రామ్ రెడ్డి నాయక్
ధూమా నాయక్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు టై, బెల్టు, డైరీ ల వితరణ 
నవతెలంగాణ – వీర్నపల్లి 
: చిన్న నాటి నుంచి విద్యార్థులు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవాలని నార్కోటిక్స్ ఎస్పీ భూక్య రామ్ రెడ్డి నాయక్ తెలిపారు. వీర్నపల్లి మండలం ఉమ్మడి గర్జన పల్లి గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో సోమ వారం ధూమ నాయక్ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి గర్జనపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టై, బెల్ట్, డైరీ లను నార్కోటిక్స్ ఎస్పీ భూక్య రామ్ రెడ్డి నాయక్ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఎదుర్కొన్న కష్టాలే ఉన్నత స్థాయిలో నిలబడేలా చేశాయని తెలిపారు. తాత్కాలిక వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు.

ట్రస్ట్ ఛైర్మెన్ విజయ రాంరెడ్డి మాట్లాడుతూ, చదువుకునే వారికి తమ ట్రస్ట్ ద్వారా అవసరమైన సౌకర్యాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి గర్జనపల్లి గ్రామం నుంచి ఐదుగురు ఐ పి ఎస్, ఐ ఏ ఎస్ కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు కేవలం విద్యాభివృద్ధి కే తాము ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు, ట్రస్ట్ సహాయంతో విద్యార్థులు బాగా చదువుకోనీ దేశంలోనే గర్జనపల్లి కి పేరు తీసుక రావాలన్నారు. ఉమ్మడి గర్జన పల్లి గ్రామంలోని 4 పాఠశాలల 150 మంది విద్యార్థులకు టై, బెల్ట్, డైరీలను అందించామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు తిరుపతి జాదవ్ ,ప్రేమ్ సాగర్, గజన్, కావేరి, దేవేందర్, గ్రామ కార్యదర్శులు ప్రవీణ్, సుష్మా, స్కూల్ డెవెలప్ మెంట్ కమిటీ చైర్మన్ లు రాకేష్ గౌడ్, నవీన్ నాయక్, మాజీ సర్పంచ్ లు రవి నాయక్, శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -