నవతెలంగాణ – మంచిర్యాల : మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లో యువకుడిపై దాడి కల కలం రేపింది. ఆదివారం రాత్రి రామకృష్ణ పూర్ కి చెందిన కొమ్ము సంతోష్ (34)పై కొందరు యువకులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. బిజినెస్ వ్యవహారాల విషయంలో అదే ప్రాంతానికి చెందిన దుర్గం వెంకటేష్ , సంతోష్ ల మధ్య కొన్ని రోజుల నుండి తగదలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంతోష్ పై దాడి జరిగినట్లు సంతోష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంతోష్ ను మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కొరకు జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా రాత్రి సంతోష్ కు బొల్లం అంజి అనే వ్యక్తి కాల్ చేసి నీకు వెంకటేష్ కు మధ్య ఉన్న గొడవ కు సంబంధించి మాట్లాడాలని అన్నాడు. సంతోష్ అంజి దగ్గరికి వెళ్లాడని, అక్కడ వెంకటేష్ అతని కుటుంబ సభ్యులు బొల్లం అంజితో కలిసి తన భర్త పై దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని సంతోష్ భార్య మల్లిశ్వరి ఆరోపిస్తోంది. మా కుటుంబానికి బొల్లం అంజి, వెంకటేష్, అతని కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని, పోలీసులు తన భర్తపై జరిగిన దాడికి న్యాయపరమైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ ఓక వీడియో విడుదల చేసింది.
యువకుడిపై కత్తులతో దాడి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES