Tuesday, July 15, 2025
E-PAPER
Homeజిల్లాలుబీడీ కార్మికులకు షరతులు లేకుండా రూ.4016 జీవన భృతి ఇవ్వాలి 

బీడీ కార్మికులకు షరతులు లేకుండా రూ.4016 జీవన భృతి ఇవ్వాలి 

- Advertisement -

తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ ఆద్వర్యంలోమంత్రి సీతక్కకు వినతి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: బీడీ కార్మికులకు ఎలాంటీ షరతులు లేకుండా 4016 రూ. జీవన భృతి ఇవ్వాలి అని  తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర  పంచాయతీ రాజ్ అభివృద్ధి, స్త్రీ శీశు సంక్షేమ మంత్రి సీతక్కకు వినతి పత్రం సోమవారం అందజేశారు. తెలంగాణ రాష్ట్రములోని బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికులందరికి 2014,పిబ్రవరి 28 కటాప్ తేదిని తొలగించి ఎలాంటి షరతులు లేకుండా 4016 రూ. జీవన భృతి బీడీ పరిశ్రమ లో పనిచేయు బీడీ కార్మికుల కు, ప్యాకర్లకు,బట్టి చటన్, టేకేదార్, ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని కోరారు. 

తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నగరపు యెల్లయ్య, లు,బహుజన యుద్ధ నౌక ఏపూరి సోమన్న సహా కారంతో, మంత్రి సీతక్క ను కలిసి వినతిపత్రం అందజేయగా మంత్రి సీతక్క సమస్య ప్తె సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కి, మంత్రి ని కల్పించిన బహుజన యుద్ధ నౌక సోమన్న కృతజ్ఞతలు, తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -