Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమన ఊరు-మనబడి బిల్లులను వెంటనే చెల్లించాలి

మన ఊరు-మనబడి బిల్లులను వెంటనే చెల్లించాలి

- Advertisement -

– విద్యాశాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల మహాధర్నా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో మన ఊరు-మనబడి పథకం కింద పనలు చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత కాంట్రాక్టర్ల నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ సర్కారు 2022-23 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం మన ఊరు మనబడి పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. టెండర్ల ద్వారా పనులను అప్పగించిందని అన్నారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, భోజనశాలలు, ప్రహరీగోడలు, మంచినీటి సంపులు వంటి పనులను చేశామని వివరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కాంట్రాక్టర్లకు నిధులను ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతున్నదని చెప్పారు. మన ఊరు- మనబడి పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించడం లేదన్నారు. చేపట్టిన పనుల వివరాలను ఇంజినీరింగ్‌ అధికారులు రికార్డు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మన ఊరు-మనబడి కింద పనులు చేపట్టిన పాఠశాలలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -