– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గిరిజన సంఘాల వినతి
– సానుకూలంగా స్పందించిన మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన గురుకుల విద్యాసంస్థలో మిగిలిపోయిన సీట్లను త్వరగా భర్తీ చేసేందుకు గిరిజన గురుకుల సంస్థకు అనుమతివ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, తెలంగాణ గిరిజన సమాఖ్య అంజయ్య నాయక్, గిరిజన సంఘం హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం బాలు నాయక్, గిరిజన సమాఖ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నేనావత్ రూప్ సింగ్, నాయకులు ఇస్లావత్ శ్రీను నాయక్ వినతి పత్రాన్ని సమర్పించారు. రూ.154 కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయాలనీ, అంబేద్కర్ విద్యా నిధి పథకంలో విదేశీ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల లిస్టును తక్షణం ఆమోదించాలని కోరారు. గిరిజన గురుకుల విద్యాసంస్థ మనుగడను ప్రశ్నార్ధకంగా మారుస్తున్న సంక్షేమ గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి వ్యవహార శైలిని కట్టడి చేయాలని కోరారు. గురుకులాల సెట్ కన్వీనర్ గా వ్యవహరించిన ఆమే గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో మిగిలిన వేలాది సీట్లను భర్తీ చేసుకోవడానికి గిరిజన గురుకుల విద్యాసంస్థకు బదిలీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గురుకులాల్లో సీట్లు రానివారు, పరీక్ష రాయని వారు వందలాదిమంది విద్యార్థులు,వారి తల్లిదండ్రులు గిరిజన గురుకుల సంస్థకు వచ్చి పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. మంత్రి స్పందిస్తూ బెస్ట్ అవైల్‌బుల్ పథకం బకాయిలను, సీఎం వద్ద ఉన్న అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకంలోని విద్యార్థుల లిస్టుకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసేందుకు తగిన కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
గిరిజన గురుకులాల్లో మిగిలిన సీట్లను భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES