నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ కు సోమవారం రోజున గండి కొట్టడంతో నీరంతా వృధాగా పోతుంది.మండలం మీదిగా మద్నూర్ మండల వరకు ఈ పైప్ లైన్ ఉండడంతో ప్రతినిత్యం పెద్దకొడప్ గల్ మండలంతో పాటు జుక్కల్,బిచ్కుంద,మద్నూర్,మండలాల్లోని ఆయా గ్రామాలకు ఈ పైప్ లైన్ ద్వారానే నీరు సరఫరా జరుగుతుంది.దీనితో గండి కొట్టిన ప్రదేశంలో చుట్టుపక్కల ప్రాంతాల జలమయం అయింది. గతంలో కూడా ఈ ప్రాంతంలోనే పైప్ లైన్ కు గండిపడగా తిరిగి ఇదే చోటు గండి కావడంతో స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే అధికారులు మరమ్మత్తులు చేసి తిరిగి పునరావృతంగా కావడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం గురించి స్థానికులు మిషన్ భగీరథ సిబ్బందికి సమాచారం అందించడంతో ప్రధాన పైప్లైన్ నీరు సరఫరాను నిలిపివేశారు. నిలిపివేసి మంగళవారం రోజున పైప్ లైన్ మరమ్మత్తులు చేపట్టారు ఇటువంటి సమస్య మరొకసారి ఏర్పడకుండా ప్రతిష్టంగా మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో మండలంలోని పలు గ్రామాల్లో పళ్ళు తాండాలల్లో నీటి సమస్య ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రతిసారి ఇదే చోట గండి పడుతుందని చేయాల్సిన మరమ్మత్తులు చేయకుండా తూతూ మంత్రంగానే మరమ్మత్తులు చేయడంతో మళ్లీ ఈ పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కంటికి కట్టినట్టుగా వివరిస్తుందని ఇకపై నుండి ఈ సమస్య రాకుండా చూడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.