– భర్త వివాహేతర సంబంధమే కారణం
నవతెలంగాణ-హసన్‌పర్తి
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త, అతని తల్లిదండ్రుల వేధింపులు భరించలేక ఓ యువ వైద్యురాలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం రాత్రి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగింది. హసన్‌పర్తి సీఐ వి.చేరాలు, మృతురాలి తల్లి పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని మట్టెవాడకు చెందిన డాక్టర్ ప్రత్యూష (35) ఆరేపల్లి ఎన్‌ఎస్‌ఆర్ హాస్పిటల్‌లో డెంటిస్ట్‌గా పనిచేస్తుంది. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ అల్లాడి సృజన్‌తో ప్రత్యూష వివాహం 2017లో జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు జానుషా సృజన్ (7), ఏడు నెలల జెస్వికాస్ సృజన్ ఉన్నారు. కాగా, డాక్టర్ సృజన్‌కు గత 8, 9 నెలలుగా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రత్యూష.. సృజన్‌ను ప్రశ్నిచడంతో.. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దాంతో ఈ విషయాన్ని సృజన్ తల్లిదండ్రులకు చెప్పింది. వారు కొడుకును మందలించకపోగా.. అతన్ని సమర్ధిస్తూ ప్రత్యూషను వేధించేవారు. అంతేకాకుండా సృజన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ సైతం ప్రత్యూషకు ఫోన్ చేసి బెదిరించేది. దాంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రత్యూష తల్లి తంజావూరు పద్మావతి సోమవారం హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రత్యూష మృతికి కారణమైన అల్లుడు, అతని తల్లిదండ్రులు, మహిళపై కూడా చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చేరాలు తెలిపారు.
యువ వైద్యురాలి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -