Wednesday, July 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రియుని మోజులో భర్తను చంపిన భార్య..! 

ప్రియుని మోజులో భర్తను చంపిన భార్య..! 

- Advertisement -

నవతెలంగాణ – మోటకొండూరు 
ప్రియుని మోజులో భర్తను చంపిన భార్య సంఘటన మండల పరిధిలోని కాటేపల్లిలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై నాగుల ఉపేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రోజున కాటేపల్లి వంతెన సమీపాన రాయగిరి నుండి మోత్కూరు వెళ్తున్న TS 30G5035 నెంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారు  వెనక నుండి T /R పల్సర్ బైక్ ను డీ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు.  బైక్ నడుపుతున్న వ్యక్తి వస్తుపూల స్వామి /నర్సయ్య (36) పల్లెర్ల గ్రామం ఆత్మకూరు మండలం మరొకరు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా వుండగా ప్రియుడి మోజులో భర్తను భార్యే కారుతో చంపించిందని పోలీసులు గుర్తించినట్లు  ప్రాథమిక సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -