నవతెలంగాణ హైదరాబాద్: ‘‘ఉదయం 7.30 గంటలకు ఓ వ్యక్తిపై కాల్పులు జరిగాయని సమాచారం వచ్చింది. సీపీఐ నాయకులు చందునాయక్ మార్నింగ్ వాక్ చేస్తుండగా స్విఫ్ట్ కారులో వచ్చిన నలుగురు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నాం. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నాం.
స్పాట్‌లో 5 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. క్లూస్ టీమ్ ద్వారా అన్ని ఆధారాలు సేకరించాం. ఘటనా స్థలిలో దొరికిన బుల్లెట్లను పరిశీలిస్తే.. వెపన్‌తో ఫైరింగ్ చేసినట్టుగా ఉంది. స్పాట్‌లో ఉన్న సీసీ కెమెరాతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న అని కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నాం. పాతకక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. నిందితులు ఉపయోగించిన కారును గుర్తించాం. త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం’’ అని డీసీపీ చైతన్య కుమార్ తెలిపారు.