Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి: డిఎస్పి 

విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి: డిఎస్పి 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ, BC,SC,ST-JAC ఆధ్వర్యంలో మండల MRO సునీతకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు చంద్ర శేఖర్ మహారాజ్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి ప్రభుత్వ పాఠశాలలో బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల పిల్లలు చదువుతున్నారు. వారికి సరైన విద్య అందాలంటే ప్రతి స్కూలుకు బస్సులు కేటాయించి ఉచిత బస్ సౌకర్యంతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వమ డిమాండ్ చేస్తూ ఎమ్మార్వో సునీతకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాగార్జున, వెంకటేష్, మహేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -