Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ వాటర్ సెక్షన్, శానిటేషన్ జవాన్లకు కనీస వేతనం పెంచాలి

మున్సిపల్ వాటర్ సెక్షన్, శానిటేషన్ జవాన్లకు కనీస వేతనం పెంచాలి

- Advertisement -

బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు 
దండి వెంకట్ డిమాండ్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: మున్సిపల్ వాటర్ సెక్షన్, శానిటేషన్ జవాన్లకు కనీస వేతనం రూ 19 ఐదు వందలు అమలు చేయాలి అని బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో వాటర్ సెక్షన్ శానిటేషన్ జవాన్లకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో కనీస వేతనం రూ 19 ఐదు వందలు అమలు చేయాలి బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు.

ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని డిప్యూటీ లేబర్ కమిషనర్ సమక్షంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో జాయింట్ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ..గత సంవత్సరం నుండి వాటర్ సెక్షన్ శానిటేషన్ జవాన్లకు కనీస వేతనం రూ 19 ఐదు వందలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ బిఎల్ టీయూ ఆధ్వర్యంలో అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ దున్నపోతు పై వర్షం కురిసిన తీరును వ్యవహరించడంతో నిజామాబాద్ డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయంలో కేసు వేయడం జరిగిందన్నారు.

లేబర్ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గత సంవత్సరం నుండి కాలయాపన చేస్తూ మున్సిపల్ కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం మేడే దినోత్సవం సందర్భంగా గైర్హాజరు పేరుతో ఒక రోజు వేతనం కట్ చేశారంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్మికుల శ్రమ దోపిడికి ఏవిధంగా పాల్పడుతున్నారో అర్ధమవుతుందన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇదేవిధంగా వ్యవహిరిస్తే ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, సీనియర్ నాయకులు ఆర్ మురళి, గోపాల్, డ్రైవర్స్ యూనియన్ నాయకులు లక్ష్మన్, సంతోష్ గౌడ్, మోహన్ గౌడ్, సాయిలు ,వినోద్, శానిటేషన్ జవాన్ల యూనియన్ నాయకులు కిరణ్, బాబు, ప్రశాంత్, యూసుఫ్,రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -