Wednesday, July 16, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆ రెండు రోజులు తెలంగాణలో బీభత్సంగా వానలు..

ఆ రెండు రోజులు తెలంగాణలో బీభత్సంగా వానలు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: తెలంగాణలో మళ్లీ వర్షాలు బీభత్సంగా కురిసే అవకాశముంది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం మరింత పెరిగే సూచనలు ఉన్నాయని హెచ్చరించింది. రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జూలై 17, 18 తేదీలకు పసుపు హెచ్చరికను జారీ చేసింది. అయితే జూలై 16 తేదీకి మాత్రం ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదని తెలిపింది. ఈ పసుపు హెచ్చరిక రాష్ట్రంలోని అనేక జిల్లాలకు వర్తించనుంది. వడగండ్ల వానలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


ఇక వాతావరణ పరిశోధకుడు టి. బాలాజీ తన ఖచ్చితమైన అంచనాలతో ప్రజలలో విశ్వాసం సంపాదించుకున్నవారు. ఆయన ప్రకారం జూలై 17 నుంచి 22 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి తీవ్ర వడగాల్పులు, ఉరుములతో కూడిన వర్షాలు విస్తృతంగా కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కనిపించవచ్చని తెలిపారు. దీని తరువాత జూలై 23 నుంచి 28 వరకు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తృత స్థాయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్‌లో కూడా ఆ రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని ఆయన అంచనా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -