- Advertisement -
రికార్డు 6.93 కోట్ల వీక్షణలు
లండన్ : డిజిటల్ వీక్షణల్లో వింబుల్డన్ 2025 సరికొత్త రికార్డులు సృష్టించింది. 2023లో 5.43 కోట్లు, 2024లో 5.01 కోట్ల వీక్షణలు నమోదు కాగా.. ఈ ఏడాది ఏకంగా 6.93 కోట్ల మంది వింబుల్డన్ పోటీలను డిజిటల్ ప్రసార వేదికల్లో వీక్షించారు. ఈ మేరకు బిబిసి ఓ ప్రకటనలో తెలిపింది. సినర్, అల్కరాస్ మెన్స్ సింగిల్స్ ఫైనల్‌ను టీవీ, ఆన్‌లైన్‌లో 80.8 లక్షల మంది వీక్షించారు. ఇందులో 80.3 లక్షల డిజిటల్ వీక్షణలు ఉండటం గమనార్హం. స్వైటెక్, ఆమంద మహిళల సింగిల్స్ ఫైనల్‌కు 40.1 లక్షల డిజిటల్ వీక్షణలు వచ్చాయి.
- Advertisement -