Wednesday, July 16, 2025
E-PAPER
Homeఆటలుజులై 14 నుంచి 30

జులై 14 నుంచి 30

- Advertisement -

2028 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ విడుదల
లాస్‌ఏంజిల్స్‌ (యుఎస్‌ఏ) :
అమెరికా ముచ్చటగా మూడోసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 1932, 1984లో విశ్వక్రీడలకు వేదికగా నిలిచిన యుఎస్‌ఏ.. 2028 ఒలింపిక్స్‌కు లాస్‌ఏంజిల్స్‌లో నిర్వహించనుంది. 2028 మెగా ఈవెంట్‌ షెడ్యూల్‌ను నిర్వహణ కమిటీ, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సోమవారం విడుదల చేశాయి. ఈసారి ఒలింపిక్స్‌ పోటీలు ఆరంభ వేడుకలకు ముందే షురూ కానున్నాయి. జులై 14, 2028న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ఆరంభ వేడుకలు జరుగుతాయి. లాస్‌ ఏంజిల్స్‌ మెమోరియల్‌ కొలిజియం, సోఫి స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. జులై 30న మెమోరియల్‌ కొలిజియంలో ముగింపు వేడుకలు షెడ్యూల్‌ చేశారు.
1900 తర్వాత తొలిసారి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చగా.. జులై 12 నుంచి 29 వరకు మ్యాచులు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్‌లో భారత్‌ పతకం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు జట్ల చొప్పున తలపడతాయి. లాస్‌ ఏంజిల్స్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని ఫెయిర్‌గ్రౌండ్స్‌ క్రికెట్‌ స్టేడియంలో మ్యాచులను షెడ్యూల్‌ చేశారు. క్రికెట్‌లో మెడల్‌ మ్యాచ్‌లు జులై 29న జరుగుతాయి. అథ్లెటిక్స్‌ ఈవెంట్లు జులై 15-30న జరుగుతాయి. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో నీరజ్‌ చోప్రా భారత పతక ఆశలను మరోసారి మోయనున్నాడు. ఒలింపిక్స్‌లో ఎనిమిది స్వర్ణాలు సాధించిన భారత హాకీ జట్టు.. మరో మెడల్‌ వేటను జులై 12-29న షురూ చేయనుంది. బ్యాడ్మింటన్‌ పోటీలు జులై 15-24న జరుగుతాయి. బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌ ఈసారి పతకాలు ఆశిస్తోంది. రెజ్లింగ్‌ పోటీలు జులై 24-30న జరుగుతాయి. షూటింగ్‌ పోటీలు జులై 15-25న నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -