Wednesday, July 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థి సందీప్‌కు బంగారుపతకం

కెమిస్ట్రీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థి సందీప్‌కు బంగారుపతకం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల ఐదు నుంచి 14 వరకు యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్‌ -2025లో నారాయణ విద్యార్థి కుచ్చి సందీప్‌ బంగారు పతకాన్ని సాధించారు. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి సింధూర నారాయణ, పి శరణి నారాయణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సందీప్‌ బంగారు పతకాన్ని సాధించి భారతదేశ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేశారని తెలిపారు. ప్రపంచం మొత్తం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన యువ రసాయన శాస్త్రవేత్తలతో ఆయన గట్టిపోటీ ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. అయినా అసాధారణమైన ప్రతిభాపాటవాలతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారని వివరించారు. ఈ విజయం వెనుక నారాయణ విద్యాసంస్థల అధ్యాపకుల ప్రోత్సాహం, నిరంతర మద్దతు ఉందని తెలిపారు. అధునాతన సైద్ధాంతిక భావనలు, ప్రయోగశాలల్లో ఉండే సవాళ్లతో కూడిన పరీక్షలతో తీర్చిదిద్దారని పేర్కొన్నారు. సందీప్‌ విజయం భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు సాధించేందుకు పునాదులు వేస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -