Thursday, July 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆవాజ్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎండీ జబ్బార్‌, మహమ్మద్‌ అబ్బాస్‌

ఆవాజ్‌ అధ్యక్ష, కార్యదర్శులుగా ఎండీ జబ్బార్‌, మహమ్మద్‌ అబ్బాస్‌

- Advertisement -

39 మందితో కొత్త కమిటీ ఎన్నిక
గద్వాలలో ముగిసిన 3వ మహాసభలు
నవ తెలంగాణ – జోగులాంబ గద్వాల

ఆవాజ్‌ రాష్ట్ర 3వ మహాసభల్లో రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు 39 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. జోగులా ంబ గద్వాల జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగిన ఆవాజ్‌ రాష్ట్ర మహాసభలు ముగిశాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని తీరు మైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. సోమవారం పారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో రాష్ట్ర ప్రతినిధుల సభ నిర్వహించారు. అనంతరం 39 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎండీ జబ్బార్‌, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్‌ అబ్బాస్‌, కోశాధికారిగా షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌, ఉపాధ్యక్షులుగా అతిఖుర్‌ రెహమాన్‌, అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, సయ్యద్‌ హాషం, అబ్దుల్‌ నబీ, సహాయ కార్యదర్శలుగా ఎంఏ జబ్బార్‌, ఎంఏ ఇక్బాల్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఖలీం, నశీర్‌ అహ్మద్‌, మహబూబ్‌ అలీ (హైదరాబాద్‌ సౌత్‌), అయ్యూబ్‌ ఖాన్‌, మహమ్మద్‌ అలీ, రఫత్‌ అంజుమ్‌ (హైదరాబాద్‌ సెంట్రల్‌), మహమ్మద్‌ గౌస్‌, ఫయ్యాజ్‌ అహ్మద్‌ (మేడ్చల్‌), లతీఫ్‌ అహమ్మద్‌, షేక్‌ ఇమామ్‌ పాషా, పాషా (యాదాద్రి భువనగిరి), సలీమ్‌ సర్కారు (సోషల్‌ మీడియా స్టేట్‌ ఇన్‌చార్జి), మహబూబ్‌ అలీ, కో-ఆప్షన్‌ (నల్లగొండ), ఎండీ జహంగీర్‌ (సూర్యాపేట), బాబు, సత్తార్‌ (ఖమ్మం), అక్మల్‌ పాషా, రహీం ఖాన్‌ (వరంగల్‌), గఫ్ఫార్‌ (ములుగు), అజహరుద్దీన్‌ (జనగామ), రజియా సుల్తానా (జగిత్యాల), సౌకత్‌ (మెదక్‌), హబీబ్‌ (వికారాబాద్‌), మహమ్మద్‌ సలీం (మహబూబ్‌ నగర్‌), సలీం (నాగర్‌ కర్నూల్‌), ఖాజా (వనపర్తి), రహమతుల్లా (గద్వాల), మౌలాలి (నారాయణపేట) ఎంపికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -