Thursday, July 17, 2025
E-PAPER
Homeబీజినెస్ముంబయిలో టెస్లా తొలి షోరూం ప్రారంభం

ముంబయిలో టెస్లా తొలి షోరూం ప్రారంభం

- Advertisement -

ముంబయి : ఎలన్‌ మస్క్‌కు చెందిన విద్యుత్‌ కార్ల కంపెనీ భారత్‌కు తన కార్యకలాపాలను విస్తరించింది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఆ సంస్థ ఏర్పాటు చేసిన టెస్లా షోరూంను మంగళవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్‌ లాంచనంగా ప్రారంభించారు. ‘మోడల్‌ వై’ కారును ఆవిష్కరించారు. ఈ కార్ల ధరల శ్రేణీ రూ.38.63 లక్షల నుంచి రూ.69.15 లక్షలుగా ఉన్నాయి. తమ కార్లను ఒక్కసారి చార్జి చేస్తే 500-600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఆ కంపెనీ తెలిపింది. టెస్లా తన అమ్మకాలకు సరైన రాష్ట్రం, నగరాన్ని ఎంచుకుందని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -