నవతెలంగాణ – భైంసా: జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ఆశవాహులకు రిజర్వేషన్ టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఆర్డినెన్స్ జారీ చేయనున్న తరుణంలో ఆశవాహుల్లో టెన్షన్ మొదలైంది. రిజర్వేషన్ పై కోర్టుకెళ్లిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా తమ పార్టీ నుండి బీసీలకు 42 శాతం కల్పిస్తామని ప్రకటించడంతో ఎన్నికలు వస్తాయనడంలో ఎ లాంటి సందేహం లేదు. కాంగ్రెస్ మార్క్ నిరూపించుకుందేకు ఈ సారి రిజర్వేషన్ లు మారనున్నాయి. ముధోల్ నియోజకవర్గం లో 7 జడ్. పి టి సి స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కుభీర్ కు ఎస్టీ రిజర్వ్ కాగా, తానూర్ కు బిసి మహిళ, ముధోల్ కు జనరల్ మహిళా, భైంసా కు బిసి జనరల్, బాసర కు ఎస్. సి. జ నరల్, కుంటాలకు జనరల్ మహిళా స్థానాలు దక్కాయి.
ఈ సారి బి. సి. లకు ఒక సీటు పెరిగే ఆస్కారం ఉన్నట్లు రాజకీయల్లో చర్చ జరుగుతుంది. మండలాల వారిగా రిజర్వేషన్ లు మారుతాయని జనరల్, బీసీ స్థానాలకు అన్ని చోట్ల డిమాండ్ పెరగనుంది. ఇప్పటి నుండి ఆశవహులు తమకు టికెట్ దక్కించుకునేందుకు పార్టీ ల వారీగా నాయకులు ఎవరికి వారే తమకు మద్దత్తు ఇవ్వాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ముధోల్ నియోజకవర్గం లో బిజెపి ఎమ్మెల్యే రామరావ్ పటేల్ ఉండడం తో జడ్. పి. టి సి స్థానాల్లో పోటి చేసేందుకు ఎక్కువ పోటి నెలకొంది. ఒక్కో మండలం నుంచి నలుగురు, ఐదుగురు పోటి పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండడం మాజీ ఎమ్మెల్యే లు నారాయణ్ రావ్ పటేల్, విఠల్ రెడ్డి, వేణుగోపాలచారి లు ఒకే పార్టీ లో ఉండడం తో ఆ పార్టీ లో ఆశవహులు పెరిగారు. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బి. ఆర్. ఎస్. పార్టీ భావిస్తుంది.. ఎం. పి టిసి ల తో కలిసి జడ్ పి టి సి ఎన్నికలు ఉండడం తో ఇక ఈజీ గా గెలువ వచ్చని జడ్. పి టి సి ఆశవహులు ఎక్కువ మొత్తం లో పుట్టుకోస్తున్నారు. పోటి చేయడానికి రెడీ గా ఉన్నప్పటికీ రిజర్వేషన్ ప్రక్రియ తమకు కలిసి వస్తుందో రాదోనని నాయకుల్లో టెన్షన్ మొదలయింది.
ఆశావాహులకు రిజర్వేషన్ దడ ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES