నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని గ్రామాలలో విద్యుత్తు నియంత్రికలు దొంగతనాలు రోజురోజుకు పెరుగుతుండడంతో రైతులు, అయా గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 15న తెల్లవారుజామున మండలంలోని బిజ్జల్ వాడినికి చెందిన రైతులు లాడే సోపాన్ రావ్ పాటిల్, రాజేందర్ పాటీల్, బాబన్న, నారాయణ గౌడ్ , షేక్ ఇస్మాయిల్ గ్రామంలోని వ్యవసాయ భూములలో అమర్చుకున్న ఐదు విద్యుత్ నియంత్రికలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. రైతులు మంగళవారం ఉదయం పొలంలోకి వెళ్ళేసరికి విద్యుత్ నియంత్రికలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నెలరోజుల ముందు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అది మురువక ముందే డోన్గాం గ్రామంలోని శివారులో ఐదు విద్యుత్ నియంత్రికలు దొంగలు ఎత్తుకెళ్లారు.
గతంలో ఎస్సై భువనేశ్వర్ విధుల్లో ఉన్నప్పుడు ఈ దొంగలను పట్టుకోలేకపోయారు. ప్రస్తుతం కూడా అదే తంతు కొనసాగుతుందని మండల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ఇటీవలే నాలుగు రోజుల క్రితం నియామకం జరిగిన ఎస్సై మొదటగా జుక్కల్ పీఎస్ కు కొత్త అపాయింట్మెంట్ అయ్యాడు. దీంతో ఆయనకు ఇంకా మండలంలోని గ్రామాలలో వాతావరణాన్ని పూర్తిగా స్టడీ చేయలేకపోవడం, అనుభవం తక్కువ ఉండడంతో, మండలంపై ఇంకా పట్టు రాలేదని వినికిడి. ఇకనైనా విద్యుత్ నియంత్రి గల చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం దొంగతనం జరిగిన ప్రదేశాన్ని ఎస్సై నవీన్ చంద్ర పరిశీలించారు. ఈ దొంగతనాలకు కారకులైన వారిని అతి తొందర్లోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ నియంత్రికల చోరీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES