నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కలిసి బుధవారం లేఖ రాశారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా లడాఖ్ యూనియన్ టెరిటరీని రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేశారు. గతంతో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా, జమ్మూకశ్మీర్ ప్రజలు నిరంతరంగా పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. వారి అభ్యర్థన న్యాయసమ్మతమైనదని రాజ్యాంగ, ప్రజాస్వామ్య హక్కులకు లోబడి ఉందని పేర్కొన్నారు.. గతంలో కొన్ని యూనియన్ టెరిటరీలకు రాష్ట్ర హోదా ఇచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ, జమ్మూకశ్మీర్ విషయంలో ఆలస్యం చేయడంలో ఆంతర్యమేంటని ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధానికి మోడీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.
జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలి: కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES