- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
గత పార్లమెంట్ సమావేశాలలో ఘట్కేసర్ నుండి యాదాద్రి వరకు ఎంఎంటిఎస్ కు పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించి నిధులు విడుదల చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఎంఎంటిఎస్ కు కావలసిన మొత్తం రూ.412 కోట్లు కేంద్రం భరించి పనులు పూర్తి చేస్తామని హామి ఇచ్చింది. మొదటి దశలో 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.100 కోట్ల విడుదల చేస్తున్నట్లు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
- Advertisement -