పార్లమెంటరీ కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కణమనేని చక్రధర్ రెడ్డి పిలుపునిచ్చారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంట్ కోకన్వీనర్ చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఇచ్చిన హామీలు అమలుపరిచేలా ప్రజలంతా సహకరించాలని కోరారు. గత బిఆర్ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవినీతి పాలనపై ప్రజలు ఇసుక చెంది ఉన్నారని కాంగ్రెస్ కు పట్టం కట్టాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మంచి పేరును టిఆర్ఎస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అప్పులతో పెనుబారం మోపినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. కెసిఆర్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను మోసం చేశారని బీసీలకు 42% ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండాలని ఈ ప్రాంత ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించి మరింత అభివృద్ధి చెందాలని చక్రధర్ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు గోనె ఎల్లప్ప, సత్తు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారావు, అన్నల్దాస్ భాను, ఈగల తిరుపతి, కే శ్రీనివాస్ రెడ్డి, పొన్నం లక్ష్మణ్ గౌడ్, వంగరి దత్తు, సామల బాబు, మధుసూదన్ రెడ్డి, దుర్గయ్య, కనకయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అండగా నిలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES