Sunday, July 20, 2025
E-PAPER
Homeజిల్లాలుగవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న గడ్కోల్ కర్క గణేష్

గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్న గడ్కోల్ కర్క గణేష్

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ  : తెలంగాణ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా తెలంగాణ యూనివర్సిటీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో మొట్టమొదటి డాక్టరేట్ కర్క గణేష్ అందుకోవడం జరిగింది. డాక్టర్ జి.లలిత సూపర్వైజర్ గా “ఎఫెక్ట్ ఆఫ్ సింటరింగ్ మెథడాలజీ ఆన్ స్ట్రక్చరల్, మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపోసిట్ ఫెర్రైట్స్” అనే అంశంపై పరిశోధన చేశారు.

కర్క గణేష్ నిజామబాద్ రూరల్ గడుకోల్ గ్రామం, సికొండ మండలానికి చెందిన విద్యార్థి. గడ్కోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి, కామధేను జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి, గిరిరాజ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకొని, తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసుకుని, మొట్టమొదటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో డాక్టరేటు పొందడం విశేషం. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు, కుటుంబ సభ్యులు అభినందనలు, ఆనందాన్ని వ్యక్తం చేశారు. డాక్టరేట్ సాధించడానికి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అధ్యాపకుల, కుటుంబ సభ్యుల ప్రోత్సాహకం ఎంతో ఉందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -