– సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్
నవతెలంగాణ – చిగురుమామిడి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చిగురుమామిడి మండలంలో సీపీఐ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలిచి తమ సత్తా చాటాలని…సీపీఐకి పూర్వవైభవం తెవాలని, ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం రోజున మండలంలోని ఎంపిటీసి స్థానాల వారీగా ఆయా గ్రామాలలో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేశారు. చిగురుమామిడి మండలం కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా, ఎన్నో త్యాగాలు, పోరాటాలతో పార్టీ బలపడిందన్నారు.
పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసం పనిచేసిన వారి ఆశయాలను కొనసాగించేందుకు ఎర్రజెండా ఎగురవేసి పార్టీ పునర్వైభవం సాధించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని తెలిపారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు పేదల సంక్షేమం పక్కన పెట్టి పార్టీ కార్యకర్తలకే పథకాలు అందించాయని విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీ ప్రజాప్రతినిధులు గెలిస్తేనే ప్రజలకు నిజమైన న్యాయం, సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. ఈ సమావేశాల్లో జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడెం లక్ష్మీ, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి,అందె చిన్న స్వామి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి బూడిద సదాశివ,రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శి కోమటిరెడ్డి జయపాల్ రెడ్డి,గోలి బాపు రెడ్డి,నాయకులు మావురపు రాజు, ముద్రకోల రాజయ్య, ఎం .డి.ఉస్మాన్ పాషా,ఇల్లందుల రాజయ్య అల్లేపు జంపయ్య,ఎనగందుల రాజు, కయ్యం తిరుపతి, బోట్ల పోచయ్య, కూన లెనిన్, రాకం అంజవ్వ,గంధె కొమురయ్య, తాల్లపెల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.