నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులతో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో రాము బుదవారం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశం మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ హలులో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ, ఎంపీవో మాట్లాడుతూ .. జీపి గ్రామాలలో పారిశుధ్యంపైన దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. మురికి కాలువలు నిత్యం శుబ్రం చేయించాలని, నీటి గుంతలు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పూడ్చి వేయాలని తెలిపారు. ఇందుకోసం వెంటనె చర్యలు చేపట్టాలని సూచించారు.
వన మహోత్సవ కార్యక్రమములో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో చేయాలని తెలిపారు. మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు చొప్పున నాటాలని, వాటి సంరక్షణ బాధ్యత వారే తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగేలా చూడాలని అన్నారు. పీఎంఏవై ఆవాస్ 2024 నాటి సర్వే, పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీరు, సీజనల్ వ్యాధిలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పిఎఐ అంశంపై కార్యదర్శులతో చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు ఎంపీఓ, గ్రామపంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శులతో ఎంపీడీఓ రివ్యూ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES