Saturday, July 19, 2025
E-PAPER
Homeఖమ్మంరింగ్ బండ్ కు రక్షణగా ఇసుక సంచులు: ఐబీ డీఈఈ క్రిష్ణ

రింగ్ బండ్ కు రక్షణగా ఇసుక సంచులు: ఐబీ డీఈఈ క్రిష్ణ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : గతేడాది ఇదే రోజుల్లో అధిక వర్షాలు నేపద్యంలో ధ్వంసం అయిన పెద్దవాగు ప్రాజెక్ట్ కు గతేడాదే నిర్మించిన రింగ్ బండ్ కు ఈ ఏడాది రక్షణ చర్యలు చేపట్టామని డీఈఈ ఎల్.క్రిష్ణ తెలిపారు. బుధవారం తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ సహా ఆయన పెద్దవాగు ప్రాజెక్ట్ రింగ్ బండ్ ను పరిశీలించారు.ఈ క్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడు ఈ ప్రాజెక్ట్ పై ఈ నెల 3 న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు అని,అదే క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్,నీటిపారుదల శాఖ ఎస్.ఈ ఎస్ శ్రీనివాసరెడ్డి దేశాలు మేరకు రింగ్ బండ్ కు 1000 వేయి ఇసుక సంచులు సిద్దం చేసామన్నారు.వీటిని రింగ్ బండ్ కట్టకు మద్దతుగా పెడతామని అన్నారు. వారివెంట ఏఈఈ ఎల్.శ్రీనివాస్ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -