Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసుపు పంటలో పోషక లోపం... నివారణ

పసుపు పంటలో పోషక లోపం… నివారణ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ గ్రామంలో పలువురు రైతుల పసుపు తోటల్లో పోషక లోపం గుర్తించినట్లు వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ తెలిపారు. విడిగా వేసిన పసుపులో కాకుండా, పసుపులో మొక్కజొన్న  అంతర్ పంటగా వేసిన పంట తోటల్లో ఈ పోషక లోపం గుర్తించినట్లు తెలిపారు. వర్షాలు కురియకపోవడంతో రైతులు మొక్కజొన్న పంట కోసం బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నందున భూమిలో అధిక తేమ వలన పసుపు పంటలో పోషక లోపం ఏర్పడుతుందని తెలిపారు. పోషకాహార లోపం వల్ల మొక్కల్లో ఎదుగుదల మందగిస్తుందని, పసుపు ఆకులు తెల్లబారి ఎండిపోతాయని తెలిపారు.

రైతులు పసుపు పంటలో పోషక లోప నివారణకు 19:19:19 10 గ్రాములు, లీటర్ నీటిలో మరియు ఫార్ములా 6.5 గ్రాములు/లీటర్ నీటిలో ( లేదా) టర్మెరిక్ బూస్టర్ కలిపి స్ప్రే పంటలో స్పేస్ చేయాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్ రైతులకు సూచించారు. అదేవిధంగా పసుపు పంటలో వచ్చే దుంప కుళ్ళు రోగం నివారించడానికి వాడే ట్రైకోడర్మో విరిడే కమ్మర్ పల్లి రైతు వేదికలో అందుబాటులో ఉందని, అవసరం  ఉన్న రైతులు సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -