– బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : కాంగ్రెస్ నాయకుల అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలు, అహంకార వైఖరితో విర్రవీగుతున్న తీరును, అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు గురువారం నిర్వహించ తలపెట్టిన చలో వేల్పూర్ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల తరపున ఎక్స్ గ్రేషియా అందని వారికోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా అందించే పథకం పై చర్చించడానికి సిద్ధమని పేర్కొంటూ వేల్పూర్ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వస్తానని సవాల్ విసిరిన సంగతిని ఆయన గుర్తు చేశారు.
మానాల మోహన్ రెడ్డి సవాల్ ను పార్టీ తరపున స్వీకరిస్తూ, 17వ తేదీ రోజున తాము కూడా సిద్ధమేనని నేను చెప్పేందుకు చలో వేల్పూరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీల అమలు, అన్ని పథకాలపై చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు అందరు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కాంగ్రెస్ నాయకుల అబద్ధపు మాటలు, మోసపూరిత హామీలు, అసత్య ప్రచారాలను, అహంకార వైఖరితో విర్రవీగుతున్న తీరును తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ శ్రేణులకు తెలిపారు.
మండలంలోని ఆయా గ్రామాల నుంచి రైతు రుణ మాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, రూ.500కే సిలిండర్, రూ.4 వేల పెన్షన్, కల్యాణ లక్ష్మీ లో తులం బంగారం, అర్హులై ఉండి ఇందిరమ్మ ఇళ్ళు, గల్ఫ్ లో చనిపోయి ప్రభుత్వ ఎక్స్ గ్రేషియా అందని, ఇలా ప్రభుత్వ పథకాలు అందని వారితో పెద్ద ఎత్తున తరలివచ్చి చలో వేల్పూర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దేవేందర్ కోరారు. వేల్పూర్ లోని ఎమ్మెల్యే కార్యాలయానికి ఉదయం 10గంటల వరకు పథకాలు రాని వారితో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు అందరూ చేరుకోవాలని సూచించారు.
చలో వేల్పూర్ ను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES