Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల సభ్యులకు రక్త పరీక్షలు: ఏపీఎం

మహిళా సంఘాల సభ్యులకు రక్త పరీక్షలు: ఏపీఎం

- Advertisement -

నవతెలంగాణ-తొగుట : గ్రామ సంఘం పతాధికారులకు, వివోఏలకు రక్త పరీక్షలు నిర్వహించామాని ఏపీఎం శ్రీనివాస్ తెలి పారు. బుధవారం ఇందిరా మహిళా శక్తి సంబరా ల్లో భాగంగా మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో మండలంలోని గ్రామ సంఘం పతాధికారులకు వివోఏలకు రక్త పరీక్షలు నిర్వహించారు. అనంత రం ఏపీఎం మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెర్ప్ సీఈవో, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జయదేవ్ ఆర్య, జిల్లా మెడికల్ అధికారుల అను మతితో రక్త పరీక్షలు నిర్వహించామాని అన్నారు. ఈ ఆరోగ్య కార్యక్రమం తొగుటలో రెండు రోజుల పాటు నిర్వహింస్తామని చెప్పారు. ఈరోజు రాని వారు రేపు కూడా హాజరు కావాలని తెలిపారు.

 గ్రామ సంఘం పతాధికారుల యొక్క ఆరోగ్య ప్రొఫైల్ ను సక్రమంగా సిద్ధం చేసి భద్రపరిచి సెర్ప్ కార్యాలయం కి పంపిస్తామని తెలిపారు. మహిళ లు రక్తహీనత కారణంగా ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొంటున్నరని అవేదన వ్యక్తం చేశారు. ఆరో గ్యపరమైన చర్యలకు తీసుకొనుటకు మహిళలకు హిమోగ్లోబిన్ బి12, బి త్రీ, లివర్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకుని అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధాకృష్ణ, టెక్నికల్ సిబ్బంది విజయ్ కుమార్, స్వరూప, భవిత, జ్యోతి, గ్రామ సంఘాల పతాధికారులు, వివోఏలు, సీసీలు రజిని, విజయ, వరలక్ష్మి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -