వాస్తవాలు ప్రశాంత్ రెడ్డికి తెలిసేవిధంగా కనువిప్పు కార్యక్రమం
నవతెలంగాణ – కంఠేశ్వర్ : గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పై అబద్ధపు మాటలు మాట్లాడుతూ.. అసత్యాలు ప్రచారం చేస్తున్న ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు తెలియజేయడానికి గురువారం ఆయనకు కాంగ్రెస్ పార్టీ కనువిప్పు కార్యక్రమం ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి బుధవారం తెలిపారు. గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం ప్రశాంత్ రెడ్డి గల్ఫ్ బాధితుల పట్ల అండగా నిలబడలేదని అన్నారు. గల్ఫ్ బాధితుల బాధను చుసిన సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇవేవి తెలియనట్టు కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలనే దురచలనతే ప్రశాంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలు చూపించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలపై చర్చించడానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను మానాల మోహన్ రెడ్డి,బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి,రాష్ట్ర విత్తనబివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి రేపు వేల్పూరు గ్రామానికి వస్తున్నాం. కావున ప్రశాంత్ రెడ్డి నీకు ఏమైనా నీతి ఉంటే గురువారం వేల్పూరు కి రా.. గల్ఫ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలుస్తుందో చూపిస్తాము. ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న వచ్చి ప్రశాంత్ చెప్తున్న వాస్తవం ఎంటో గ్రహించగలరని అన్నారు.
గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల ప్రశాంత్ రెడ్డి అబద్ధపు మాటలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES