నవతెలంగాణ – భైంసా
రిటైర్డ్ ఎస్ఐ గౌస్ విధి నిర్వహణలో చేపట్టిన సేవలు నేటి తరానికి ఆదర్శనీయమని జిల్లా ఎస్పి జానకి షర్మిల అన్నారు. బుధవారం భైంసా పట్టణంలోని శ్రీ బంకెట్ హల్ లో పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. 8 సంవత్సరాలుగా భైంసా పట్టణ ఎస్ఐగా విధులు నిర్వర్తించి, పోలీస్ డిపార్టుమెంట్ కు మంచి పేరు తెచ్చారన్నారు. భార్య, భర్తలను కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్నో కుటుంబ గొడవలను పరిష్కరించారన్నారు. కుల మతాలకు అతీతంగా అందరితో కలిసి ఉంటూ మంచి పేరు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. బాధ్యత యుతంగా విధులు నిర్వర్తించి, వృత్తి పట్ల నిబద్దత కలిగిన వ్యక్తి గౌస్ అని ఎఎస్పి అవినాష్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన గౌస్ మాట్లాడుతూ .. 42 సంవత్సరాల పాటు విధి నిర్వహణలో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో పట్టణ సిఐ గోపినాథ్, సిఐలు నైలుతో పాటు ఎస్ఐ లు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఎస్ఐ గౌస్ సేవలు ఆదర్శనీయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES