Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంముగిసిన మోటూరి పూర్ణచందర్‌రావు అంత్యక్రియలు

ముగిసిన మోటూరి పూర్ణచందర్‌రావు అంత్యక్రియలు

- Advertisement -

మాదాపూర్‌ నుంచి జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర
నివాళులర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని, ఎస్‌.వీరయ్య, టి.జ్యోతి, నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

గొప్ప మానవతావాది, కార్మిక పక్షపాతి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు మోటూరి పూర్ణచందర్‌రావు అంత్యక్రియలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో బుధవారం ముగిశాయి. ఆయన భౌతికకాయానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎస్‌.వీరయ్య, టి.జ్యోతి, రాష్ట్ర నాయకులు నివాళులర్పించారు. పూర్ణచందర్‌రావు ఈనెల 13న ఆదివారం గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం మాదాపూర్‌ కాకతీయహిల్స్‌లోని వారి స్వగృహానికి తీసుకొచ్చారు. సీపీఐ(ఎం), ప్రజాసంఘాల నాయకులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. పార్టీ సీనియర్‌ నాయకులు డిజి.నర్సింహారావు, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పి.సత్యం, ఏపీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర్‌రావు, ఐలు రాష్ట్ర నాయకులు పార్థసారథి, పీఎస్‌ఎన్‌ మూర్తి, గచ్చిబౌలి ఎస్‌వీకే కార్యదర్శి సాంబశివరావు, నవతెలంగాణ దినపత్రిక సీజీఎం ప్రభాకర్‌, ప్రజాశక్తి సీజీఎం అచ్యుత్‌రావు, సీపీఐ(ఎం) నాయకులు, సానుభూతిపరులు పూర్ణచందర్‌రావుకు నివాళులర్పించారు. అంతకుముందు జాన్‌వెస్లీ, వీరయ్య, జ్యోతి, సత్యం తదితరులు ఆయన భౌతికకాయంపై సీపీఐ(ఎం) జెండా కప్పి నివాళ్లర్పించారు. పూర్ణచందర్‌రావు సీఐటీయూలో, సీపీఐ(ఎం) పార్టీ హైదరాబాద్‌ కార్యదర్శివర్గ సభ్యునిగా పనిచేశారని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేసుకున్నారు. హెచ్‌ఎంటీలో పనిచేసిన కార్మికులందరికీ సొంత ఇల్లు నిర్మించే ప్లాన్‌ చేసి.. సొసైటీ ద్వారా కల నెరవేర్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం కాకతీయహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానం వరకు అంతియయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ప్రజలు, వామపక్ష పార్టీల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -