Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంఇదే చివరి అవకాశం

ఇదే చివరి అవకాశం

- Advertisement -

టాయిలెట్ల విషయంలో
ఆదేశాలు పాటించలేదేం?
ఎనిమిది వారాల్లో నివేదిక దాఖలు చేయాలి
లేకపోతే తీవ్ర పరిణామాలు : హైకోర్టులపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ :
దేశంలోని అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లలో టాయిలెట్‌ సౌకర్యాలపై ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సౌకర్యాల నిర్ధారణ నివేదికలను సమర్పించకపోవడంపై 20 హైకోర్టులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఎనిమిది వారాల సమయమిచ్చింది. ఇదే చివరి అవకాశమని బుధవారం జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ ఆర్‌ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం చెప్పింది. ఎనిమిది వారాల్లోపు రిపోర్టు దాఖలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. న్యాయవాది రాజీబ్‌ కలిత దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం సరైన పారిశుధ్యం పౌరుల ప్రాథమిక హక్కు అని జనవరి 15న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గుర్తు చేసింది. దేశంలోని అన్ని కోర్టు ప్రాంగణాలు, ట్రైబ్యునళ్లలో పురుషులు, మహిళలు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేయాలని హైకోర్టులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. దీనిపై నాలుగు నెలల్లోపు అప్పటి పరిస్థితిపై నివేదికను కూడా సమర్పించాలని తెలిపింది.

అఫిడవిట్‌ దాఖలు చేయకపోతే తీవ్ర పరిణామాలు
అయితే జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, కోల్‌కత్తా, ఢిల్లీ, పాట్నా హైకోర్టులు మాత్రమే తీర్పును పాటిస్తూ తీసుకున్న చర్యల వివరాలను తెలుపుతూ అఫిడవిట్‌ దాఖలు చేశాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంకా అనేక హైకోర్టులు తమ అఫిడవిట్లు దాఖలు చేయలేదని, వీరందరికి ఎనిమిది వారాల చివరి అవకాశాన్ని ఇస్తున్నట్టు చెప్పింది. ఒకవేళ అఫిడవిట్‌ దాఖలు చేయడంలో విఫలమైతే హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్‌ వ్యక్తిగతంగా కోర్టులో హాజ రుకావాలని ఆదేశించింది. జనవరి 15న ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులు పర్యవేక్షించాలని గుర్తుచేసింది. దీంతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పింది.

హైకోర్టుల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశం
ఇంకా ఇందుకోసం ప్రతి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి నామినేట్‌ చేసిన న్యాయమూర్తి అధ్యక్షతన హైకోర్టు రిజిస్ట్రార్‌, ప్రధాన కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి, బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధి సహా ఇతర అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సూచిం చింది. టాయిలెట్ల ఏర్పాటుపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని, ఇందుకోసం సగటున కోర్టులకు ఎంతమంది వస్తున్నారనే అంశాన్ని పరిశీ లించాలని సలహా ఇచ్చింది. అందుకు తగినట్టుగా టాయిలెట్లు నిర్మించి, సరైన నిర్వహణ చేయాలని కమిటీని ఆదేశించింది. ఇంకా కోర్టు ప్రాంగణం లోని టాయిలెట్‌ సౌకర్యాల నిర్మాణం, నిర్వహణ, శుభ్రత కోసం రాష్ట్ర ప్రభు త్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగినంత నిధులను కేటాయించాలని కోరిం ది. హైకోర్టులు ఏర్పాటు చేసిన కమిటీలు వీటిని సమీక్షించాలని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -