Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫోటోజర్నలిస్టు షేక్‌ నసీర్‌ మృతి

ఫోటోజర్నలిస్టు షేక్‌ నసీర్‌ మృతి

- Advertisement -

జర్నలిజానికి తీరని లోటు : తెలంగాణ రాష్ట్ర ఫోటోజర్నలిస్టుల సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీనియర్‌ ఫోటో జర్నలిస్టు షేక్‌ నసీర్‌ ఆకస్మిక మృతి జర్నలిజం రంగానికి తీరని లోటని తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు అనుమళ్ల గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి కేఎన్‌. హరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా సమాజంలో జరుగుతున్న ఘటనలను వెలుగులోకి తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఫోటో జర్నలిజంలో అనేక అవార్డులు అందుకున్నారనీ, ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) జాతీయ కౌన్సిల్‌ సభ్యులుగా సేవలందించారని గుర్తు చేసారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో గల నివాసంలో ఉంచిన ఆయన భౌతికకాయంపై ఫోటోజర్నలిస్టులందరు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -