Saturday, July 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅలస్కాలో భారీ భూకంపం..

అలస్కాలో భారీ భూకంపం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అలస్కా రాష్ట్రంలోని ఆలూషియన్ ద్వీపకల్పం సమీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3 నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంప కేంద్రం శాండ్ పాయింట్‌కు దక్షిణంగా 54 మైళ్ల (87 కిలోమీటర్లు) దూరంలో.. ఎపిసెంటర్ 12.5 నుండి 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భారీ భూకంపం సంభవించిన వెంటనే, దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పంలోని కోడియాక్, కోల్డ్ బే, హోమర్ వంటి ప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేశారు.

ఈ హెచ్చరిక 700 మైళ్ల సుదీర్ఘ తీరప్రాంతంలో, కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్ల దక్షిణపశ్చిమం) నుండి యునిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్ల ఈశాన్యం) వరకు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ (NTWC) ఈ హెచ్చరికను కొన్ని గంటల తర్వాత సునామీ అడ్వైజరీగా డౌన్‌గ్రేడ్ చేసింది. ఆ తర్వాత సుమారు 2:43 PM స్థానిక సమయంలో హెచ్చరికను పూర్తిగా రద్దు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ భారీ భూకంపం ధాటికి పెద్ద ఎత్తున కుదుపులు రాగా.. స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్టు తెలుస్తుండగా.. ఈ భారీ భూకంపం ప్రభావంపై ఎటువంటి సమాచారం అందుబాటులోకి రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -