Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మానవత్వం చాటుతూ.. విద్యాభివృద్ధి వైపు అడుగులు

మానవత్వం చాటుతూ.. విద్యాభివృద్ధి వైపు అడుగులు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
ఒక వైపు మానవత్వం చాటుతూ మరో వైపు విద్యాభివృద్ధి కొరకు అడుగులు వేస్తున్నారు.మండల విద్యాధికారి తరిరాము. గురువారం మండల కేంద్రం లోని జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత  పాఠశాలలో ప్రార్థన సమయానికి హాజరైన మండల విద్యాధికారి తరిరాము చల్మారెడ్డిగూడకు చెందిన దివ్యాంగుడైన ఓ వ్యక్తి పని చేయలేని స్థితిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో అతను పాఠశాల ఆశ్రయించగా, ఎంఈఓ తరిరాము మానవత్వాన్ని చాటుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఆవరణలో వున్నవారు అంతా కలిసి దివ్యాంగునికి 5,000 ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.తరిరాము ఇది స్ఫూర్తిదాయక ఘటనగా చేప్పువచ్చు.
విద్యాభి వృద్ధి వైపు
మండలం లోని ప్రభుత్వ పాఠశాల ల్లోఎల్ ఐపీ కార్యక్రమం పై సమీక్షలు,ఎఫ్ఆర్ఎస్ హాజరు, యాప్ లో నమోదు,ప్యానల్స్ వినియోగిస్తూ బోధన కొనసాగించాని, విద్యార్థుల సామర్థ్యాలు, హాజరు, ఉపాధ్యాయుల హాజరు వివరాలు,వంటివి పరిశీలిస్తూ  పాఠశాలల అభివృద్ధికి, ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు మండల విద్యాధికారి తరి రాము. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -