Sunday, July 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభం

ఆయిల్ పామ్ పంట సాగుతో అధిక లాభం

- Advertisement -

నవతెలంగాణ – మద్దూరు
ఆయిల్ ఫామ్ పంట సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చు చేర్యాల డివిజన్ ఏడిఏ రాధిక అన్నారు.  గురువారం మండలం రేబర్తి గ్రామం లో రైతు చిలుపురి అనిల్ రెడ్డి,  పొలంలోనీ  22 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే 100 ఎకరాల్లో  ఆయిల్ పామ్ సాగు లో వుందని, పంట కోత కూడా ప్రారంభం అయిందని చెప్పారు.  రైతులు పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ పెట్టడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామ్మోహన్, మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఉద్యాన అధికారిణి కౌసల్య, వ్యవసాయ విస్తరణ అధికారులు, రాజు, అఖిల్, కల్పన, అనూష, రాధిక, పంచాయతీ కార్యదర్శి మాధవ్ జాదవ్ ,ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ రాకేశ్, రైతులు లింగారెడ్డి, డ్రిప్పు కంపెనీ అధికారి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -