- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
సైబర్ నేరగాళ్లతో పాటు, గేమింగ్ యాప్ ల వలలో చిక్కకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ గురువారం తెలిపారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నాయని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, తమ ధృవపత్రాలను వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు త్రిబుల్ రైడింగ్ చేయవద్దని, వాహనదారులు హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. యువత గంజాయి బారిన పడకుండా నిఘ ఏర్పాటు చేసినట్టు, వాహనాల తనిఖీని ముమ్మరం చేసినట్టు తెలిపారు.
- Advertisement -