నవతెలంగాణ – ఆర్మూర్
లే అవుట్లలో వదిలిన పది పర్సెంటు భూములను పరిరక్షించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి గురువారం పది పర్సెంట్ భూములను పరిశీలించినారు. వాటి హద్దులు గుర్తించాలని, కబ్జా అయిన భూములు, అన్యాక్రాంతం అయినా భూములలో హద్దులు గుర్తించి బోర్డ్ పెట్టాలని మొత్తం 4 ఎకరాలపైన భూమి వివిధ వెంచర్లలో గుర్తించినట్టు వాటిలో చెట్లు నాటాలని ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పనులను పరిశీలించారు. నాణ్యతతో కట్టడాలు చేయాలని, పేర్కిట్ విశాఖ కాలనిలో ఇరిగేషన్ భూముల హద్దులు గుర్తించాలని అధికారులు సమన్వయంతో పని చేయాలని అసైన్డ్ భూములలో కట్టడాలకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలని ప్రభుత్వ భూములను పరిరక్షించే బాధ్యత కాలనీవాసులదేనని అన్నారు.
గుండ్ల చెరువు సుందరీకరణ పనులను పరిశీలించరూ వినాయక విగ్రహాలు నిమజ్జనం సందర్భంలో విగ్రహాలు లోపలకు రావడం కష్టం అవుతుంది అని వెడల్పు చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం లో మినీ ట్యాంక్ బండ్ మంజూరు కావడం జరిగిందని ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు మంచి చేయాలని చూస్తుందని రాజకీయం అవసరం లేదని కేవలం ఎన్నికల వరకు మాత్రమే రాజకీయమని అని అన్నారు. ఈ కార్యక్రమంలో, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, సీనియర్ నాయకులు కలిగోట గంగాధర్, చిన్నారెడ్డి, పోశంపేట శ్రీను తదితరులు పాల్గొన్నారు.