- Advertisement -
నవతెలంగాణ – భైంసా
మండలంలోని ఇలేగామ్ గ్రామంలో వింత వ్యాధితో కదం దత్తురామ్ కు చెందిన 20 మేకలు ఒకే రోజు మృతి చెందాయి. దీంతో బాధిత రైతు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు నష్ట పోవాల్సి వచ్చింది. మేకలకు 105 జ్వరం ఉండడం, సొల్లు కారడం, దగ్గుతో మేకలు మృతి చెందుతున్నాయని దీన్ని సిసిపిపి. వ్యాధిగా నిర్దారించినట్లు పశువైద్య ఆధికారి విఠల్ తెలియజేశారు. మృతి చెందిన మేకలకు పోస్టుమార్టం చేశారు. ప్రభుత్వ పశు వైద్యశాలలో మందులు లేకపోవడంతో బాధిత రైతు తన మేకలకు చికిత్స చేయించుకోవడానికి 20 వేల రూపాయల వరకు ఖర్చు చేశాడు. మేకలకు వింత వ్యాధి రావడం తో మేకల కాపారులు ఆందోళన కు గురవుతున్నారు.
- Advertisement -